భద్రాచలం,వెలుగు : భద్రాచలం మన్యంలో గురువారం సాయంత్రం ఈదురుగాలులతో చిరు జల్లులు కురిశాయి. ఈదురుగాలులకు పినపాక నియోజకవర్గంలోని అశ్వాపురంలో భారీ వృక్షం నేలకొరిగింది. భద్రాచలంలో చెట్లు కూలి విద్యుత్‌లైన్లపై పడ్డాయి. సిబ్బంది అప్రమత్తమై వాటిని తొలగించి విద్యుత్‌ను పునరుద్దరించారు. అయితే వాతావరణ పరిస్థితులతో రైతులు కల్లాల్లోని మిరపకాయలను కుప్పలు పోసి, టార్ఫాలిన్లు కప్పారు.
